Home తెలంగాణ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

217
0

హైదరాబాద్‌ నవంబర్ 30
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు.సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Previous articleలంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డ పంచాయతీ కార్యదర్శి
Next articleమైలవరం జలాశయంను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here