Home తెలంగాణ 10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సిఎం కేసీఆర్‌ పర్యటన

10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సిఎం కేసీఆర్‌ పర్యటన

92
0

హైదరాబాద్‌ నవంబర్ 8
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్‌ దిక్షణ భాగంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు, వరంగల్‌ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్- హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వేట్రాక్‌లపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్ఓబీ)ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రజాతినిధులతో సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, టెక్స్‌టైల్‌ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Previous articleలాఠీ చార్జీ చేయలేదు
Next articleత‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here