నెల్లూరు నవంబర్ 17
. నెల్లూరు జిల్లా, బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ కె. వి. ఎన్. చక్రధర్ బాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లెక్కింపు ప్రక్రియ వివరాలను బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస రావు కలెక్టర్కు వివరించారు. ఎన్నికల అబ్జర్వర్ మరియు కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు మాట్లాడుతూ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుచ్చి నగర పంచాయితీ అయిన తర్వాత ఇదే తొలి ఎన్నికలు కావడంతో గెలుపు ఓటముల పై స్థానిక ప్రజలు ఎదురు చూశారు. ఎట్టకేలకు వైకాపా ఘన విజయం సాధించింది. టిడిపి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప విజయాలు సాధించారు. స్థానిక శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో బుచ్చి నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజను వరించింది. ఈ మేరకు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు.