Home తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

285
0

కామారెడ్డి నవంబర్ 22
జిల్లాలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో జనగామ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, లింగంపల్లి కోతుల ఆహార కేంద్రం స్థలాలు వెళ్తున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు శంకర్, సాయిలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్థలాలు పరిశ్రమ లోకి వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ ఏర్పాటుతో  పట్టా భూములు వెళ్లాయని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పట్టాలు ఉన్న  రైతులకు మరోచోట భూములను చూపించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ కృష్ణ తెలిపారు.  కార్యక్రమంలో తహసిల్దార్  వెంకట్ రావు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Previous articleఈ నెల 24న కేంద్ర మంత్రివర్గ సమావేశం నూతన వ్యవసాయ చట్టాల ప్రతిపాదనను ఉపసంహరణ మంత్రి వర్గం
Next articleకరోనా బారిన కమల్‌హాసన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here