Home ఆంధ్రప్రదేశ్ జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం ...

జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్ష

98
0

పోలవరం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.

శనివారం  స్థానిక పోలవరం ప్రోజెక్టు సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తుగా అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపునకు గురైయ్యే  గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, మందులు సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం గా ఉండాలని కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. కోరటూరు, శివగిరి, సిరివాక, చిడూరు గ్రామాలకు టూరిజమ్ బోట్ ద్వారా ప్రజా పంపిణీ సరుకులు, ఐ సి డి ఎస్  అందించే పౌష్టికాహారం అందచేసేందుకు  దేవిపట్నం తహసీల్దార్ తో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు.   రెవెన్యూ శాఖ పరంగా వసూలు చెయ్యవలసిన పన్నులు, ఆర్ ఆర్ యాక్ట్ రికవరీ లను వసూళ్ళ చెయ్యాలన్నారు.  డివిజన్ పరిధిలో ముంపు కు గురైయ్యే గ్రామాలలోని కుటుంబాలను  గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు.  ఇప్పటికే సుమారు 2400 పైగా నిర్వాసితుల గృహాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. డివిజిన్ పరిధిలో  నీటి తీరువా పన్నుల  వసూలు కు  నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వసూళ్ళ చెయ్యాలని  కలెక్టర్ కార్తికేయ మిశ్ర స్పష్టం చేశారు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో  లోతట్టులో ఉన్న  19 గ్రామాలు ముంపునకు గురి అయ్యే అవకాశాలు దృష్టిలో పెట్టుకొని,  ప్రతి ఒక్క శాఖ ఇతర శాఖలతో  సమన్వయం చేసుకుంటూ, తగిన జాగ్రత్తలు వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని కోరారు.

టూరిజమ్ పై సమీక్ష: గోదావరి నది లో పర్యాటక బోట్స్ కు తిరగటానికి అనుమతి ఇచ్చి ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఎస్ ఓ పి లో రూపొందించిన విధి విధానాలను తూ. చా. తప్పకుండా అమలు చేయాలని, పోలవరం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున అందుకు అనుగుణంగానే బోట్స్ ను నిర్దేశించిన రూట్లలో మాత్రమే, పరిమితికి లోబడి పర్యాటకులను అనుమతించాలన్నారు. పేరంటాల పల్లి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ తిరగడానికి అనువైన పరిస్థితులు పై  రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులతో కలిసి టూరిజమ్ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొవాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న స్పిల్ వే పనులను, కాపర్ డ్యామ్, ఇతర పనులు పురోగతిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్షించారు. వర్షాలు, గోదావరి నదికి వరదలు నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టారో అధికారులను అడిగి తెలుసుకుని, అనంతరం స్పిల్ వే ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. క్యాపర్ డాం నుంచి దిగువ ప్రాంతానికి రేడియల్ గేట్స్ ద్వారా విడుదల చేస్తున్న నీటి సామర్ధ్యం వివరాలు అధికారులు వివరించారు.

Previous articleసమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం టీపీసీసీ నాయకులతో అధిష్టానం సమీక్ష
Next articleమిలీయన్ మార్చ్‌ వాయిదా – బీజేపీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here