కొవ్వూరు
రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణ పని ఒత్తిడి ని అధిగమించడానికి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. బుధవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయం నుండి జిల్లా లోని రెవెన్యూ డివిజన్ అధికారులతో, తహసీల్దార్ లతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, తహసీల్దార్ లు మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పని ఒత్తిడి ని అధిగమించేందుకు సమయపాలన తో కూడిన ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు లో నిర్దుష్టమైన విధి విధానాలు మీమీ స్థాయిల్లో రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూముల రికార్డుల స్వచ్ఛిలత, భూముల రీసర్వే, జగనన్న సంపూర్ణ గృహ హక్కు లో భాగంగా వన్ టైం సేట్టిల్మెంట్ విషయం పై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్నారు. కుళాయి(నాలా) కలెక్షన్లు, రైతుల నుండి వసూలు చెయ్యవలసిన నీటి తీరువా బకాయి ల, రెవెన్యూ రికవరీ వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. పని విభజన, రోజూ వారీగా లక్ష్యాలను రూపొందించుకోవడం వలన ఉద్యోగుల పై పని ఒత్తిడి తగ్గి , మెరుగైన ఫలితాలు సాదించగలుగుతామని పేర్కొన్నారు..