నెల్లూరు
జిల్లాలో వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు తమ తమ లక్ష్యాలను అధిగమించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పేర్కొన్నారు. స్థానిక కస్తూరి దేవి హై స్కూల్ ప్రాంగణంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి 18 వేల రుణ గ్రహీత రైతులకు కార్డులు అందజేశామన్నారు. వీరందరికీ ఆయా ప్రాంతాల బ్యాంకులు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని సూచించారు. అప్పు అనే విషయం యుగయుగాలుగా వస్తుందన్నారు. తొలుత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహ సమయంలో కుబేరుని దగ్గర అప్పుచేసి ఇప్పటికి కూడా వాయిదాలు చెల్లిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయని అని అన్నారు. ఇదేవిధంగా మానవ మనుగడకు అప్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేసిన అప్పులు వాయిదాల ప్రకారం గా చెల్లించినట్లు అయితే బ్యాంకుల అభివృద్ధితో పాటు మరికొంతమందికి బ్యాంకులు ఆర్థిక సహాయం అందజేశారు అవకాశముందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, గృహ, వాహన, విద్య రుణాలు అధికశాతం అవసరం అవుతున్న విషయం విధితమే అని అన్నారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాంకర్లు తమ లక్ష్యాలను అధిగమించేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు .ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమం లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరాం ప్రసాద్ మరియు ఏపీజీబీ, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, క్యాథలిక్ సిరియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు తదితర బ్యాంకు మేనేజర్లు మరియు ఆయా బ్యాంకుల సిబ్బంది, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.