కామారెడ్డి అక్టోబర్ 25
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన పట్టా భూమి సర్వే నంబర్ 451/1 లో 1 ఎకరం 30 గుంటల భూమిని గాంధారి గ్రామానికి చెందిన ఆకుల రాములు, ఆకుల కిష్టయ్య, ఆకుల భాస్కర్, ఆకుల గంగామణి, ఆకుల శోభ, ఆకుల లక్ష్మి కుటుంబ సభ్యులు కలిసి గాంధారి తహాసిల్దార్ కార్యాలయం నుండి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వరకు కలెక్టరేట్ ముట్టడి ధర్నా పాదయాత్ర ద్వారా సోమవారం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల రాములు, ఆకుల శోభ, ఆకుల లక్ష్మి, ఆకుల గంగామణి మాట్లాడుతూ, మాకు అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదనతో పాదయాత్ర ద్వారా గాంధారి నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని, మాకు న్యాయం జరిగే వరకు కలెక్టర్ ఆఫీస్, తెలంగాణ రాష్ట్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు వద్దకు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ వెళ్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త పాస్ బుక్ లో ఎక్కించి తర్వాత ఎమ్మార్వో లక్ష్మణ్ తొలగించడం జరిగిందని, మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ పాదయాత్ర ద్వారా అవసరమైతే మా భూమి కొరకు చావడానికైనా సిద్దమే అన్నారు. అధికారులు మాకు న్యాయం చేయకపోతే మా భూమి కొరకు చావడానికైనా మా కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.