కోరుట్ల అక్టోబర్ 25
మెట్ పల్లి పట్టణంలోని 9వ వార్డులోని రామ్ నగర్, సుల్తాన్ పుర మధ్యలో ఒక వ్యక్తి ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణం నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలనీ వాసులు పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పెట్రోలు బంక్ వద్ద జాతీయ రహదారి పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాలనీలో సెల్ టవర్ నిర్మాణం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉడుత ఆనంద్ అను వ్యక్తి సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాలనీలో ప్రైవేట్ పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్న నేపథ్యంలో చిన్న చిన్న పిల్లలు సైతం ప్రమాదకర రేడియేషన్ బారినపడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రజలకు ఇబ్బందులు కలిగించే సెల్ టవర్ నిర్మాణం చేస్తే ఆందోళన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్యకు ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.