రాజంపేట, నవంబర్ 30
కడప జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయాన్ని అందించామని,ఇంకా ఎవరికైనా ఆర్ధిక సాయం అందకపోతే సోషల్ ఆడిట్ లో తమ పేర్లను నమోదు
చేసుకోవాలని, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు.
మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో సోషల్ ఆడిట్ నిర్వహణపై తహశీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్
మాట్లాడుతూ… వరద బాధిత ప్రాంతాల్లో సామాజిక తనిఖీ త్వరితగతిన పూర్తి చేయలని సమందిత అధికారులను ఆదేశించారు.రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వరద బాధిత ప్రాంతాలైన పుల పుత్తూరు, మందపల్లి,గుండ్లురు, తొగురుపేటల లోని
బాధితులందరికీ ఆర్ధిక సాయం అందించామని,ఇదే లిస్ట్ ను గ్రామ సచివాలయం లో ప్రచురించామని తెలిపారు. అలాగే ఇప్పటికే రెండో సర్వే చేపట్టామని, ఇంకా వరదబాధితులకు ఆర్ధిక సాయం అందకపోయినా, ఆర్థిక సహాయం అందడం లో ఏవైనా
సమస్యలు ఉన్నా… జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ లో నమోదు చేయాలన్నారు. ఇందుకు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల సహకారం తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. సోషల్ ఆడిట్ రిపోర్ట్
ను త్వరతిగతిన పూర్తి చేసి నివేదించాలని,ఈ సోషల్ ఆడిట్ వివరాలను గ్రామ సచివాలయ రిజిస్టర్ నందు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
సోషల్ ఆడిట్ నివేదికను పరిశీలించి వరద బాధితుల్లో ఆర్థిక సాయం అందని వారి జాబితా
తయారు చేసి తక్షణం వారందరికీ సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ సమావేశంలో వేమల తహశీల్దారు నరసింహలు,కమలాపురం తహశీల్దారు విజయకుమార్,జమ్మలమడుగు తహశీల్దారు మదుసూదన్
రెడ్డి,పెండ్లిమర్రి తహశీల్దారు విజయ బాస్కర్ రాజు,ఖాజీపేట తహశీల్దారు నారాయణ రెడ్డి,మైదుకూరు తహశీల్దారు ప్రేమనాథ్ కుమార్,సి.కె దిన్నె తహశీల్దారు మహేశ్వర రెడ్డి,వేంపల్లి తహశీల్దారు చంద్ర శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.