నిర్మల్,
జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలొ వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సందర్బంగా ఈ రోజు 23 దరఖాస్తులు వచ్చాయని, అందులో తోట క్రాంతి కుమార్ కడెం మండలం పెద్దూర్ గ్రామ నివాసి మీసేవ సెంటర్ కొరకు, లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామనివాసి పెనుగొండ ముత్యం వికలాంగుల కోటాలో కుటుంబ పోషణ కొరకు ఆధారం చూపించాలని, బైంసా మండలం లోని బీజ్జుర్ కు చెందిన లక్ష్మి తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పించాలని, బైంసా కు చెందిన సికిందర్ హైమాతఖాన్ 218 సర్వే నంబర్ లో తన 3 ఎకరాల భూమిని సర్వే చేయించాలని, తదితర దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Home తెలంగాణ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కారించాలి… –జిల్లా పాలనాధికారి ...