విజయవాడ
విజయవాడ తేదేపాలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీలో సీనియర్ నేతలకు ఎంపీ కేశినేని నాని వలన అన్యాయం జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ నేత ఎఱుబోతు రమణారావు మాట్లాడుతూ తనకు పార్టీ లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. టీడీపీ పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎంతో కష్టపడి పని చేసాను. నగర ప్రధాన కార్యదర్శి గా ఇస్తానని నమ్మించి మోసం చేశారు. బీసీ నేత అయిన తనకు తీరని అన్యాయం చేస్తున్నారు. టీడీపీ నుంచి ఫ్లోర్ లీడర్ గా పని చేసిన అనుభవం కూడా తనకు ఉంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసాను. తిరువూరు కి చెందిన నాయకుడు కి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే ఇక్కడ కార్యకర్తలు కి అవసరం వస్తే అక్కడకు వెళ్లగలరా అని ప్రశ్నించారు. టీడీపీ కి వెన్నుముక బీసీ లే అన్న విషయం గుర్తుంచుకోవాలి. పార్టీలు మారి వచ్చిన వారికి టీడీపీ లో రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి సీనియర్లు ని అవమనపరుస్తున్నారు. ఎంపీ కేశినేని నాని పార్టీని అవమానపరిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చి సీనియర్లని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ గురించి రోడ్లు ఎక్కి తాము అనేక కార్యక్రమాలు చేసాం,,ఏనాడు నాని పార్టీ గురించి పోరాడలేదు. చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా నాని స్పందించలేదు. టీడీపీ అధిష్టానానికి సీనియర్ల ఆవేదన తెలియ చేయాలనే బయటకు వచ్చాము. చంద్రబాబు,,అచ్చెన్నాయుడు విజయవాడలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. టీడీపీ ని దగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు