కడప నవంబర్ 05
కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడిగా విష్ణు ప్రీతం రెడ్డి లు, దిగ్విజయంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ వాడల, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, లేబర్ సెల్ నగర అధ్యక్షుడు వెంకన్న, అలెక్స్ సురేష్, సూర్యుడు తదితర నాయకులు శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం నేతలు మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా మాకు అన్ని విధాలుగా తోడ్పడిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రుణపడి ఉంటామని, పార్టీని బలోపేతం చేయడంలో మా వంతు కృషి తప్పకుండా చేస్తామని, 2024లో రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే అజెండాగా పనిచేస్తామని తెలిపారు.