బద్వేల్
మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ సోమవారం పోరుమామిళ్ల మండలం లో ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం చేశారు పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి ఆధ్వర్యంలో కమలమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలను వెంటబెట్టుకొని ప్రచారం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బద్వేల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ఆమె ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. ఉప ఎన్నికల్లో వైకాపా బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆమె కోరారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని ఆమె కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు జే ప్రభాకర్ కమల్ ప్రభాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.