వికారాబాద్
ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఎన్నేపల్లి గ్రామానికి చెందిన డేవిడ్( 40) వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్ పేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య హేమలత ఎండోమెంట్ శాఖ లో పనిచేస్తుంది. హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డేవిడ్ గత నెల రోజులుగా విధులకు హాజరు కానట్లు సమాచారం.