కడప నవంబర్ 26
నందిమండలం జడ్పీ హైస్కూల్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం వేడుకలో పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు యం.వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పదనాన్ని ,విశిష్టతను వివరించారు. అందరూ రాజ్యాంగ యొక్క స్పూర్తితో దేశాభివృద్ధికి పాలు పంచుకోవాలని అన్నారు.అందరితో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. పిల్లలను గుడ్డు,చిక్కీ, మెనూ ప్రకారం అందుతున్నాయా? అని అడిగి, తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు.పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం కావాలని, కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీ 41 వర్యాంకు సాధించిన అల్లు శ్రీకాంత్ ను ఎంపిక కావడం పట్ల అభినందించారు. తదుపరి ఉపాధ్యాయులందరితో సమావేశమయి, నూతన విద్యావిధానం అమలు తీరును ఆరా తీసారు. తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాష్టర్ కళావతి, మండల విద్యాశాఖాధికారిణి సుజాత, ఆంగ్ల ఉపాధ్యాయుడు గునిశెట్టి శ్రీనివాసులు, పీడీ రాజశేఖర్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.