Home ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో 2 రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలి రైల్వే జీఎంకు ఎంపీ ఆదాల వినతి

నెల్లూరులో 2 రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలి రైల్వే జీఎంకు ఎంపీ ఆదాల వినతి

125
0

నెల్లూరు

నెల్లూరు నగరంలో 2 రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రైల్వే జీఎం గజానన్ మాల్యాను కోరారు. విజయవాడలో  గురు వారం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ మేరకు కోరారు. నెల్లూరు నగర పరిధిలోని రంగనాయకులపేట లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. అదేవిధంగా కొండాయపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అడిగారు. ఈ ప్రాంతాల్లో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల సత్వరం వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా
బిట్ర గుంటలో రైల్వే పరిశ్రమ పెట్టాలని ప్రతిపాదించారు.
బిట్రగుంట రైల్వే స్టేషన్ పరిధిలో  ఉన్న 1600 ఎకరాల ఖాళీ స్థలంలో  ఒక పరిశ్రమ ఏర్పాటుకు సిఫార్సు చేయాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగారు. మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిగతా వ్యవహారాలు నడిపిస్తామని చెప్పారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ తో సహా ముఖ్యమైన స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉండేచోట లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా సీనియర్ సిటీజన్లకు మహిళలకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇచ్చేందుకు సరైన పరిస్థితులు లేవు. అందువల్ల రైల్వే నిధులతోనే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సిఫార్సు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము మాట్లాడుతామని పేర్కొన్నారు. కొడవలూరు మండలం లోని రాజుపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్.వి.ఎన్.ఎల్ సంస్థ మూడో రైల్వే లైన్ పనులు చేస్తోందని, ఆ సంస్థకు సామాజిక బాధ్యత కింద నెల్లూరు నగరంలో మూడో రైల్వే లైన్ కు సమాంతరంగా ఉన్న ఖాళీ ఉన్న స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని కూడా జీఎం కు అందజేశారు.

Previous articleఆర్థిక శాఖ మంత్రి దృష్టికి పెన్షనర్ల సమస్యలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
Next articleఅక్టోబర్ 22న థియేటర్లలో “మిస్సింగ్” రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here