తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని మారెళ్ళ గ్రామంలో బీసీ కాలనీ కు శాశ్వత నూతన పైపులైను ఏర్పాటు చేశారు.శనివారం రోజున గ్రామ గౌరవ సలహాదారుడు సుధాకర్ రెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి రాముడు ఆధ్వర్యంలో బి.సి.కాలనీ కు నూతన పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపారు.బిసి కాలనీలో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల సమస్యల పరిష్కారం కొరకై నూతన పైపులైను ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.