పత్తికొండ
పత్తికొండలో ఆర్టీసీ కొత్త బస్టాండ్ సమీపంలో లక్ష్మీ నగర్, వ్యవసాయ మార్కెట్ దగ్గర రామకృష్ణా రెడ్డి నగర్, వడ్డే గిరిలో కోటి రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిన పనులను ప్రారంభించిన పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్న మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ,పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక ,జెడ్పీటీసీ సభ్యులు ఉరుకుందమ్మ , పత్తికొండ నూతన ఎంపీపీ నారాయణ దాస్,వైస్ సర్పంచ్ పల్లె కళావతి, ఉప్పరా సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప,జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, వైస్ యం పి పి కొత్తపల్లి బలరాముడు,కో ఆప్షన్ మెంబర్ కారుమంచి నజీర్,మాజీ సర్పంచ్ సోమశేఖర్,హుస్సేన్ ,మహమూద్ మరియు పంచాయతీరాజ్ డిఇ శేషయ్య, ఎంపీడీవో పార్థసారథి, గ్రామపంచాయతీ ఈఓ కృష్ణ కుమార్, పి ఆర్ ఏ ఈ శ్రీనివాసులు, కాంట్రాక్టర్ మురళీ మోహన్ రెడ్డి , తుగ్గలి మండలం వైయస్సార్ పార్టీ జిట్టా నాగేష్ యాదవ్ తుగ్గలి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులు ప్రజా పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన ఈ సమస్యను పరిష్కరించలేదు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మా సమస్యను పరిష్కరించి అందరి ఎమ్మెల్యేల కాకుండా మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తామని నిరూపించార ని కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.