Home తెలంగాణ కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

152
0

రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం రగుడు నుండి వెంకటాపూర్ వరకు 10 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మిస్తున్న 4 వరుసల బైపాస్ రోడ్డు పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్యాకేజీ -9, మిషన్ భగీరథ, సెస్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. రోడ్డు నిర్మించడానికి అడ్డంగా ఉన్న మిషన్ భగీరథ ఛాంబర్స్, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లను తొలగించాలని సెస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రగుడు చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంగా ఉన్న నీటిని తొలగించాలని ప్యాకేజీ -9 అధికారులను, చంద్రంపేట శివారులో ఉన్న రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న తాటిచెట్లను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. భూములు, బావులకు సంబంధించిన పరిహారాన్ని చెల్లించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఇంచార్జ్ రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, ఆర్ & బి ఈఈ కిషన్ రావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ప్యాకేజీ -9 ఈఈ శ్రీనివాస రెడ్డి, ఏడీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సెస్ డీఈఈ రఘుపతి, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.

Previous articleశ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి 28 రోజుల హుండీ లెక్కింపు
Next articleఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ దీపావ‌ళి స్పెష‌ల్ షో..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్‌ త‌మ‌న్ స‌ర‌దా స‌ర‌దా సాగిన ఎపిసోడ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here