న్యూఢిల్లీ నవంబర్ 1
సాగు చట్టాలపై బీకేయూ నేత రాకేష్ తికాయత్ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా డెడ్‌లైన్ విధించారు. ఈనెల 26లోగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని బీకేయూ జాతీయ ప్రతినిధి తికాయత్ సోమవారం ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని స్పష్టం చేశారు.27లోగా ఈ చట్టాలను వెనక్కితీసుకోకుంటే గ్రామాల నుంచి ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన ప్రాంతాలకు అన్నదాతలు పోటెత్తుతారని, రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ చట్టాల రద్దుపై రైతుల డిమాండ్లకు కేంద్రం తలొగ్గాలని మొండివైఖరి వీడి సానుకూలంగా స్పందించాలని రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదికి పైగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
Home జాతీయ వార్తలు ఈనెల 26లోగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి బీకేయూ...