Home నగరం త‌మిళ స్టార్ హీరో విజ‌య్, ఆయ‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ మ‌ధ్య వివాదం

త‌మిళ స్టార్ హీరో విజ‌య్, ఆయ‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ మ‌ధ్య వివాదం

131
0

చెన్నయ్ సెప్టెంబర్
తమిళ స్టార్ హీరో విజ‌య్, ఆయ‌న తండ్రి ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ మ‌ధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్న‌ట్టుగా కనిపిస్తుంది.ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య ఇటీవ‌ల విజ‌య్ అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారంటూ.. తన తల్లితండ్రులతో పాటు మరి 11 మందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తమిళనాట సంచలనంగా మారింది. తన తల్లితండ్రులు విజయ్ పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని.. తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ 2020లో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని విజయ్‌ ఇటీవల చెన్నై హక్కుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగింది.తాజాగా దళపతి విజయ్‌కు ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ షాక్‌ ఇచ్చారు. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు ప్రకటించారు. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు చంద్రశేఖర్‌ సమాధాన పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పరిణామాలతో తండ్రి, తనయుడి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ‘

Previous articleదేశ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోన్న కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అక్టోబ‌ర్ రెండో వారం వ‌ర‌కు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాల‌ని ల‌క్ష్యం సోమవారం ఒక్క రోజే 1,00,96,142 మందికి టీకాలు
Next articleఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి కృతజ్ఞలు తెలిపిన జడ్పీ కో ఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here