అమరావతి అక్టోబర్ 21
ఏపీని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. లక్షల కోట్ల అప్పులపై మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఇబ్బందిపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నాపై దేశద్రోహం కేసు పెట్టారు. ఉండవల్లి మీద, పవన్ మీద కూడా రాజద్రోహం కేసు పెడతారా? ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చినందుకే నన్ను శిక్షించారా అని ప్రశ్నించారు.దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అప్పులు చేశారు. ఏమైనా మాట్లాడితే పోలీసులు లేఖలు రాస్తారు. పోలీసులు ఆటోలకు స్టిక్కర్లు వేస్తారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.