సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మిగతా వారికి ఇవాళ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్లో ఉంచి విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.