న్యూఢిల్లీ నవంబర్ 26
దక్షిణాఫ్రికా, బోత్సువానాలో నమోదు అయిన కరోనా బి.1.1.529 వేరియంట్ దడపుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వేరియంట్‌కు చెందిన కేసులు ఇండియాలో నమోదు కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. బి.1.1.529 వేరియంట్‌కు చెందిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. బి.1.1.529 వేరియంట్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్లు తీవ్ర స్థాయిలో మ్యుటేట్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. సౌతాఫ్రికా, బోత్సువానా, హాంగ్‌కాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికులపై స్క్రీనింగ్ చేస్తున్నారు. బి.1.1.529 వేరియంట్ 50 మ్యుటేషన్లకు లోనైందని, దానిలో స్పైక్ ప్రోటీన్లు 30 సార్లు పరివర్తన చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.