Home వార్తలు దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. నిన్న‌టికంటే 12 శాతం అధికం

దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. నిన్న‌టికంటే 12 శాతం అధికం

86
0

న్యూఢిల్లీ ఆగష్టు 28
దేశంలో మ‌రోమారు క‌రోనా కేసులు పెరిగాయి. శుక్ర‌వారం 44 వేల కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 46 వేల‌కు పెరిగాయి. ఇవి నిన్న‌టికంటే 12 శాతం అధిక‌మ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కాగా దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌రో మైళురాయిని అధిగ‌మించింది. 24 గంట‌ల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని తెలిపింది.దేశంలో కొత్త‌గా 46,759 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,26,49,947కు చేరింది. ఇందులో 3,18,51,802 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 4,37,370 మంది మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌రో 3,59,775 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా, శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 509 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 46,759 మంది బాధితులు కోలుకున్నార‌ని వెల్ల‌డించింది. ఇక దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 62,29,89,134 డోసుల‌ను పంపిణీ చేశామ‌ని పేర్కొన్న‌ది. ఇందులో గ‌త 24 గంట‌ల్లో కోటీ 3ల‌క్ష‌ల 35వేల 290 మందికి వ్యాక్సినేష‌న్ చేశామ‌ని తెలిపింది.

Previous articleరాష్ట్రంలో అన్ని రంగాల్లో బ‌హుముఖ‌మైన అభివృద్ధి పిల్లిగుడిసెల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Next articleనలుగు ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు , గండిపేట జలాశయాలకు వరద పోటెత్తి నిండుకుండలా మారాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here