న్యూఢిల్లీ సెప్టెంబర్ 17
దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం మళ్లీ ముప్పైవేలు దాటాయి. తాజాగా ఆ సంఖ్య 34 వేలకు చేరింది. ఇవి గురువారం నాటికంటే 12.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,81,728కు చేరింది. ఇందులో 3,49,056 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,25,98,424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,44,248 మంది మహమ్మారికి బలయ్యారు. ఇందులో కొత్తగా 37,950 మంది వైరస్ నుంచి బయటపడగా, 320 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో 77,24,25,744 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఒక్క రోజులోనే 63,97,972 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.