న్యూఢిల్లీ అక్టోబర్ 25
దేశంలో కొత్తగా 14,306 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,89,774కు చేరింది. ఇందులో 3,35,67,367 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,67,695 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,54,712 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో 443 మంది మరణించగా, 18,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,538 కేసులు ఉన్నాయని, 71 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.