Home నగరం దేశంలో తగ్గుముఖం పడుతున్న కారోనా.. కొత్తగా 29,616 కేసులు

దేశంలో తగ్గుముఖం పడుతున్న కారోనా.. కొత్తగా 29,616 కేసులు

115
0

న్యూఢిల్లీ సెప్టెంబర్ 25
దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది.దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో నిన్న 127 మంది మరణించారని వెల్లడించింది. మరో 127 మంది మరణించారని ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

Previous articleసుభాష్ మృతిపట్ల సమాచారపౌర సంబంధాల శాఖ సంతాపం
Next articleచిన్నతనం నుంచే విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here