Home తెలంగాణ మనుషులకు జీవితం విలువలు తెలిపిన కరోనా మహమ్మారి జిల్లా న్యాయ...

మనుషులకు జీవితం విలువలు తెలిపిన కరోనా మహమ్మారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్.గోవర్ధన్‌రెడ్డి

248
0

నిజామాబాద్‌ సెప్టెంబర్ 25
కరోనా మహమ్మారితో మనుషులకు జీవితం విలువ తెలిసి ఆరోగ్యంగా జీవించే కళను నేర్చుకుంటున్నారని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆరోగ్య క్రమశిక్షణను అలవర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ నిత్య జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రసంగించారు.కరోనా సెకండ్‌వేవ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే ప్రజలు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు తమ విలువైన జీవితాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలందించారని ప్రశంసించారు. అంతర్జాతీయ చెవిటి దినోత్సవం సందర్భంగా చెవిటి, మూగ వారికి ఆరోగ్య పరికరాలను ఉచితంగా అందజేయడం మహాభాగ్యంగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ ప్రతిమారాజ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో ‘క్రయోమిషన్‌’ ను ఏర్పాటు చేశామని క్యాన్సర్‌కు ముందు వచ్చే అనారోగ్య సమస్యలను గుర్తించి ముందస్తుగా వైద్య చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు.అదనపు జిల్లా జడ్జి షౌకత్‌ జహన్‌ సిద్దికి, జూనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి విక్రమ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కళార్చన, చందన, సౌందర్య, గిరిజ, భవ్య, వైద్యులు, వైద్యులు జీవన్‌రావు, విశాల్‌, కార్డియాలజిస్ట్ కళ్యాణ్‌ కూరపాటి, దివ్య, ఫణికుమార్‌, సంధ్యారాణి, ద్వారకాదేవి, అన్వేష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌గుప్తా, సందీప్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజారెడ్డి, రెడక్రాస్ సొసైటీ సభ్యులు తోట రాజశేఖర్‌, అంజనేయులు, సంస్థ సభ్యులు మానిక్‌రాజ్‌, సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తంగౌడ్‌, చంద్రసేనారెడ్డి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ శిబిరంలో దాదాపు 300 మందికి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు.

Previous articleఆరోగ్య‌, విద్యా రంగంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ
Next articleమహాసముద్రం ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది – పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here