కడప డిసెంబర్ 02
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసు శాఖ కొరడా ఝుళిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన షాపుల వారిపై, షాపుల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టని వారిపై విపత్తు నిర్వహణ చట్టం క్రింద కేసులు, అలాగే మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. బుధవారం మాస్క్ ధరించని వారిపై 20 కేసులు నమోదు చేసి రూ.3,480 జరిమానా విధించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖ కు సహకరించాలని, తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్.పి కోరారు. మీ ఆరోగ్య సంరక్షణ మీ చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి మాట్లాడాలని సూచించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మందులు, తదితర దుకాణాలకు వెళ్లిన సందర్భాలలో సామాజిక దూరం పాటించాలని, దుకాణాల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా దుకాణదారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్.పి హెచ్చరించారు.
Home ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్….నేథ్యంలో నిబంధనలు ఉల్లంఘనులపై పోలీసుల కొరడా జిల్లా వ్యాప్తంగా మాస్క్...