మహబూబ్ నగర్’ అక్టోబర్ 11
రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు లో పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వార్డు కౌన్సిలర్ ముష నరేందర్ తెలిపారు. తన వార్డు పరిధిలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని అని ఆయన వివరించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ తొమ్మిదవ వార్డు పరిధిలోని మర్లు ప్రాంతంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మంజూరు చేయించిన 25 లక్షల రూపాయల నిధులతో సిమెంటు రహదారులు నిర్మిస్తున్నారు. ఈ రహదారి పనులను కౌన్సిలర్ నరేందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను పూర్తిస్థాయిలో నాణ్యతతో చేపడుతున్నామని అదే విధంగా వేగంగా పూర్తి చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రజలు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరిస్తారని ఆయన వెల్లడించారు. కాగా 9వ వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తున్న కౌన్సిలర్ నరేందర్ పై వార్డు ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి ఇబ్బందులు తెలుసుకుంటూ తక్షణమే వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కి మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న నరేందర్ చక్కని నాయకుడని ప్రజలు ప్రశంసిస్తున్నారు.