Home తెలంగాణ కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించాలి జిల్లా కలెక్టర్ జి.రవి

కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించాలి జిల్లా కలెక్టర్ జి.రవి

93
0

జగిత్యాల, అక్టోబర్ 27
జిల్లాలో 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా అధికారులు,  సిబ్బంది చర్యలు పకడ్భందిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం కోరుట్ల మండలం ఐలాపురం గ్రామంలో మెట్ పెల్లి లలో ఎవెన్యూ ప్లానిటేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ జి.రవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చిమొక్కలను తొలగించి మూడు వరుసలలో మొక్కలను నాటి, వాటికి ట్రిగార్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామాలలో ఎప్పటికప్పుడు సానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెట్పల్లి పట్టణంలోని 19వ వార్డు లోని గోలహనుమాన్ ప్రాంతంతో పాటు, ఇందిరానగర్ అంబేద్కర్ మాల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆకస్మీకంగా పర్యటించి, వ్యాక్సినేషన్ కొరకు వచ్చిన చివరి వ్యక్తికి వ్యాక్సిన్ అందించేలా చూడాలని, అవసరమైతే ఉధయం, సాయంత్రం ఎక్కువ సమయం అందుబాటులో ఉండాలని, ఓటరు జాబితా ఆధారంగా వ్యాక్సిన్ పోందవలసిన వారిని గుర్తించాలని, ఓటరు జాబితాలో పేరు నమోదై ఇతర ప్రాంతాలలో వ్యాక్సిన్ తీసుకున్న వారి నుండి చరవాణి సంక్షిప్తి సందేశం లేదా ఇతర దృవీకరణల ఆధారంగా వ్యాక్సినేషన్ గురించి నిర్దారణకు రావాలని పేర్కోన్నారు.  వీలేజ్ లెవెల్ మల్టి డిసిపిలినరి టీమ్స్ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకున్న వారి ఇంటికి స్టిక్కర్లను అతికంచేలా ప్రత్యేక అధికారులు చూడాలని, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, 18 సంవత్సరాలు పైబడిన వారందరు వ్యాక్సిన్ తీసుకోవచ్చని, వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలలొ నెలకోన్న అపోహలను  వైద్యాధికారుల ద్వారా నివృత్తి చేయాలని, అవసరమైత్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కు ఫోన్ చేసి వారి సందేహాలను తీర్చుకోవాల్సిందిగా తెలపాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారులు  పిడి డిఆర్డిఓ వినోద్ , డి.పి.ఓ.నరేష్ పాటు ఇతర వైద్యాధికారులు ఉన్నారు.

Previous articleరాష్ట్రంలో ఆన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్
Next articleతెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి నిధులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here