జగిత్యాల, అక్టోబర్ 8
జిల్లాలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా అవసరమైన చర్యలు పకడ్భందిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి శుక్రవారం సంబంధిత అధికారులతో టెలికాన్పరెన్సు నిర్వహించారు. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన సమయంలో వచ్చిన స్పందన కంటే ప్రస్తుతం చాలా తక్కువగా వ్యాక్సినేషన్ జరుగుతుందని, ఈ పరిస్థితి మెరుగు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 774745 మందికి టీకాలు ఇవ్వడం లక్ష్యం కాగా తేదీ.7.10.21 నాటికి 477799 మందికి మొదటి డోస్, 156861 మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో దాదాపు 62% మంది ప్రజలకు మొదటి డోస్, 20% మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో మరో 296946 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్ర పరిదిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పి.హెచ్.సి సబ్ సెంటర్లలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసామని, ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రతిరోజు కనీసం 100 మందికి కోవిడ్ టీకా అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 274 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రోజుకి కనీసం 20000 టీకాలకు తక్కువ కాకుండా వేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో స్థానిక సంస్థల, వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి టీకాలు వేయించుకొని వారిని గుర్తించి, వారికి వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో ఉండే గ్రామాలో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని, సదరు గ్రామంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను వినియోగించుకునే విధంగా ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు మండల పరిధిలో జరిగిన వ్యాక్సినేషన్ వివరాలకు సంబంధించిన నివేదికను ఎంపిడిఒ, వైద్యాధికారి సమన్వయంతో అందించాలని, దీనిని ప్రత్యేక్ష అధికారి పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బందితో ఇంటింట సర్వే నిర్వహించి వ్యాక్సిన్ వేసుకునేవారిని గుర్తించి వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సినేషన్ వివరాలతో కూడిన స్టీకర్ ను తయారు చేసి ఇంటి ముందు అతికించాలని తెలిపారు.ఈ టెలికాన్పరెన్సులో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, గ్రామీణ అభివృద్ధి అధికారి ,జిల్లా వైద్యరొగ్యశాఖ అధికారి,మెడికల్ ఆఫీసర్స్, ప్రోగ్రాం ఆఫీసర్స్, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గోన్నారు.