విశాకపట్నం
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలక్టరేట్ వద్ద వంట వార్పు కోవిడ్ వారియర్స్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తే విధుల నుండి అర్ధాంతరంగా తొలగించడం దారుణం అని ఇప్పటివరకు తమకు వేతనాలు కూడా చెలించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో మ సేవలు అద్భుతం అని మేముచేసిన సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు అని ఈరోజు అందరిని రోడ్డున పడేశారు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోవిడ్ వారియర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి అని పెండింగ్ వేతనాలు వెంటనే రిలీజ్ చేసి అందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద వంట వార్పు నిర్వహించి నినాదాలు చేస్తూ కలక్టర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించగా వారిని అడ్డుకొని పోలీసులు స్టేషన్కి తరలించారు కోవిడ్ వారియర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్లో ఉన్న వారియర్స్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని కోవిడ్ విధుల్లో చనిపోయిన కోవిడ్ వారియర్స్ కి తక్షణమే నష్ట పరిహారం చెలించాలి అని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ లో కోవిడ్ వారియర్స్ కి ప్రాధాన్యత కల్పించాలి అని అమర్ ఏఐటీయూసీ అనుబంధం అయిన ఆంధ్ర మెడికల్ కోవిడ్ వారియర్స్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేశారు