నంద్యాల
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం నాడు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సంజీవనగర్ గేట్ దగ్గర విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ షరీఫ్ భాష. ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి ఏ సురేష్ . తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై 3669 కోట్ల రూపాయలు పెను భారం మోపింది కరోనా విపత్తు పరిస్థితులలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిపారు .
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భార్యలపై భారాలు మోపుతున్నారని అన్నారు.
సామాన్య మధ్యతరగతి. పేద ప్రజలకు గత నెలలో గృహాలకు విద్యుత్తు వినియోగం 600 రూపాయలు వస్తే ఈ నెలలో 1200 ల రూపాయలు రావడం జరిగిందన్నారు. ఈ రకంగా బిల్లులు వస్తుంటే వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరలు తో ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఐ పట్టణ సమితిగా డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకుడు కరీముల్లా కలాం. లక్ష్మయ్య గౌడ్. మద్దిలేటి. రామ్ తుల్లా. నబిషా. రంగయ్య. రమణ. తదితరులు పాల్గొన్నారు.