తుగ్గలి
రైతులు తాము సాగు చేసిన పంటలను తప్పకుండా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ తెలియజేశారు.బుధవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం నందు మండల స్థాయిలో గ్రామ వ్యవసాయ సలహా మండలి శిక్షణ కార్యక్రమం ను వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్ష వహించిన ఏ.వో పవన్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మరియు పరిశ్రమల శాఖ మరియు ఉద్యానవన శాఖలకు సంబంధించిన వివిధ రకాల పథకాల గురించి మరియు వివిధ పంటలు యాజమాన్యం గురించి వివరించారు. అదేవిధంగా రైతులు పంట నమోదు తప్పకుండా చేయించుకోవాలని,చేయించుకోని ఎడల పంట నష్టపరిహారం,క్రాప్ ఇన్సూరెన్స్, పంట కొనుగోలు వంటి పథకాలు వర్తించవని తెలియజేసారు.కనుక రైతులు పంట నమోదు తప్పక చేయించుకోవాలని తెలియజేసారు. అనంతరం హార్టికల్చర్ ఆఫీసర్ అనూష మాట్లాడుతూ ఉద్యానవన పంటల గురించి రైతులకు వివరించారు.అనంతరం వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధుల గురించి,నివారణ గురించి గ్రూప్ సభ్యులకు వివరించారు.మూగ జీవాలకు టీకాలు వేయించుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి హార్టికల్చర్ ఆఫీసర్ అనూష, వెటర్నరీ డాక్టర్ ప్రణీత,లక్ష్మన్, ఏఈవో రంగన్న, లక్ష్మీ చైతన్య,గ్రామ సహాయకులు రవి,తిమ్మప్ప, మహేష్,తులసి ఎంపీఈవో లు అజారుద్దీన్, రంగయ్య,సోమేశ్వరి,లక్ష్మి,స్రవం