Home జాతీయ వార్తలు “ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం”: ప్రధాని మోదీ

“ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం”: ప్రధాని మోదీ

107
0

న్యూ ఢిల్లీ నవంబర్ 18
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై  భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్‌ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై సిడ్నీ డైలాగ్‌ వర్చువల్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలను చేశారు.సిడ్నీ డైలాగ్‌ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా  నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిడ్నీ డైలాగ్‌ సందర్భంగా…పీఏం మోదీ తన ప్రసంగంలో….ప్రపంచ పురోగతి,  శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలపై దృష్టి సారించాలని అన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతికత ఇప్పటికే ప్రపంచ దేశాలకు ప్రధాన సాధనంగా మారిందని వెల్లడించారు. అదే సాంకేతికత పలుదేశాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని తెలిపారు.

Previous articleఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయం
Next articleబిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలిన జనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here