పెద్దపల్లి అక్టోబర్ 13
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన దాసరి రఘు విలేజ్ రామగుండం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తు కి బాటలు వేయడమే కాకుండా ప్రధాన ఉపాధ్యాయ సంఘం అయిన పిఆర్టియు టీఎస్ లో సభ్యత్వం తీసుకొని సహచర ఉపాధ్యాయుల సమస్యలపై ఉన్నతాధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి వారికి అనేక పదవులు తీసుకువచ్చాయి. వారు పిఆర్టియు జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గా పదవులు నిర్వహించారు. దాసరి రఘు సేవలు రాష్ట్ర కార్యవర్గానికి అవసరం అని గుర్తించిన రాష్ట్ర నాయకత్వం పిఆర్టియు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా నియమించింది. నిజామాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన 34వ రాష్ట్ర పిఆర్టియు టీఎస్ సమావేశాలలో దాసరి రఘు పిఆర్టియు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. తన సేవలు గుర్తించి తనకు పదవీ రావడంలో తనకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్, ప్రధాన కార్యదర్శి గండు కృష్ణ మూర్తి, మాజీ ప్రధాన కార్యదర్శి చెల్వాజి నాగేశ్వరరావు, రామగుండం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జనార్దన్ రావు, లక్ష్మినారాయణకు దాసరి రఘు కృతజ్ఞతలు తెలిపారు.