తుగ్గలి
డీలర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తుగ్గలి మండల డీలర్లు ధర్నా నిర్వహించారు.వివరాల్లోకి వెళ్ళగా రాష్ట్ర పిలుపు మేరకు డీలర్ల అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి,ఉపాధ్యక్షుడు సుంకన్న ఆధ్వర్యంలో తుగ్గలి మండలం డీలర్లు ఈ-పాస్ మీటర్లు మొరాయింపు వలన స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర బుధవారం రోజున తుగ్గలి మండలం డీలర్లు ధర్నా నిర్వహించడం జరిగింది.అనంతరం డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్.ఐ సుధాకర్ రెడ్డి కు మెమోరాండం ను అందజేశారు.ఈ-పాస్ మిషన్ వలన ప్రభుత్వ ధాన్యాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోండడం వలన ఈ-పాస్ మీటర్లు ఎమ్మార్వో ఆఫీస్ లో డీలర్లు అప్పజెప్పారు.ఈ నెల 19న ప్రారంభమైన పిఎంజికేవై పంపిణీలో ఈపాస్ మిషన్లు సరిగ్గా పనిచేయక డీలర్లు మరియు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే డీలర్లపై చొరవచూపి ఈ-పాస్ మిషన్ లను మరియు సర్వర్లను సరిగ్గా పనిచేసే విధంగా రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డీలర్ మహమ్మద్,రాజశేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి,సుదర్శన్,గౌరన్న,చంద్రన్