కడప నవంబర్13
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కడప జిల్లా 7వ మహాసభలు డిసెంబర్ 9,10 న కడప నగరంలో జరుగుతున్నాయని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.స్థానిక జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ యువజన సంఘం నిరుద్యోగ యువతి,యువకులక్ సమస్యల పై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ వస్తుందని అన్నారు.ఈ జిల్లా లో కూడా నిరుద్యోగుల హక్కులకై అనేక పోరాటాలు సాగించామని అన్నారు.రేపు డిసెంబర్ లో కడప నగరం వేదికగా జరిగే జిల్లా మహాసభలలో జిల్లా సమగ్రాభివృద్ధి పై,సమస్యల పై చర్చిస్తామని అన్నారు.జిల్లా మహాసభలకు జాతీయ,రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు.ముఖ్యంగా విభజన హామీలలో ప్రధానమైనది కడప ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నెలకొల్పాలని,అపార ఖనిజ సంపద కలిగిన కడప జిల్లా లో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.స్థానిక పరిశ్రమలలో సిమెంట్,సోలార్ పరిశ్రమలలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పాతది రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు.వీటన్ని డిమాండ్లతో రేపు జిల్లా మహాసభలలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.జిల్లా నలుమూలల నుండి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరవుతారని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముడియం.చిన్ని,నగర కార్యదర్శి షాకీర్ పాల్గొన్నారు.