హైదరాబాద్ సెప్టెంబర్ 21
తెలంగాణ లో డ్రగ్ ఫ్రీ కోసం రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ వేస్తే అక్కడకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేసుకోమని కేటీఆర్ కు ఛాలెంజ్ వేస్తే కేటీఆర్ పరువునష్టం పోయింది అనడం ఆయన అవివేకమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి తో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడారు.ప్రజా ప్రతినిధులు టెస్ట్ లు చేయించుకొని ఆదర్శంగా ఉందామని రేవంత్ రెడ్డి అంటుంటే అది పరువునష్టం ఎలా అవుతుంది. కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తే కోర్ట్ కొట్టేసింది. పరువు నష్టం దావా వేసి కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారు. కేటీఆర్, రాహుల్ గాంధీ గారితో పోల్చుకోవడం ఏమిటీ.. కేటీఆర్ టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్, రేవంత్ రెడ్డి ఎంపీగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరితే ఇక్కడకు రాకుండా ఢిల్లీకి పోతామని అనడం ఆయన భయానికి నిదర్శనం. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పెద్ద నాయకులు ఆయన పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండించాల్సిన కేటీఆర్ ఆయనకు మద్దతు పలికారు. రేవంత్ రెడ్డి విసిరిన తెలంగాణ డ్రగ్ ఫ్రీ వైట్ ఛాలెంజ్ ను కేటీఆర్ స్వీకరించాలి. రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మహా ధర్నా ఉంది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లు పాల్గొంటున్నాయి. అందుకోసం కుల సంఘాలు, ప్రజా సంఘాలతో సమావేశం అవుతున్నాం.. జాతీయ స్థాయి పిలుపు మేరకు ధరల పెరుగుదల, వ్యవసాయ బిల్లులు, ఉపాధి హామీ రోజుల పెంపు, కూలి ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తదితర అంశాలపై ఉద్యమం ఉంటుంది. 22న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా.. 27న భారత్ బంద్. 30వ తేదీన కలెక్టర్ ల వద్ద వినతిపత్రాలు సమర్పణ.. అక్టోబర్ 5న పోడు భూముల మీద ఆదిలాబాద్ నుంచి అశ్వరావు పేట వరకు రాస్తారోకో ఉంది. వీటిని విజయవంతం చెయ్యాలి… మల్రెడ్డి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి కి, కేటీఆర్ కు చాలా తేడా ఉంది..కేటీఆర్ కేవలం తన తండ్రి సహకారంతో ఎమ్మెల్యే గా, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా, మంత్రిగా అయ్యావు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నావు. రేవంత్ రెడ్డి స్వయం శక్తిగా ఎదిగారు. జడ్పీటీసీ గా, ఎంఎల్సీగా, ఎమ్మెల్యే గా, ఎంపీ గా అయ్యారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కి తెలంగా అధ్యక్షులు ఆయ్యారు. రేపు మహా ధర్నా విజయవంతం చెయ్యాలి. 20 వేల ఎకరాలలో ఫార్మా సిటీ కి కడుతున్నారు. 8 వేలకు పైగా దళితుల అసైన్డ్ భూములు ప్రభుత్వం అక్రమిచుకొని 16 లక్షలకు ఎకరం ఇచ్చారు. అమెజాన్ కంపెనీ కి కోటి 30 లక్షల ఎకరం అమ్ముకున్నారు.. 20 వేల ఏకరలతో లక్షల ఎకరాలు విషతుల్యం అవుతాయి. ఇట్టి విషయమై కేంద్రాంకి పిర్యాదు చేశామన్నారు