పెద్దపల్లి నవంబర్ 23
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గంగనగర్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, సరఫరా చేస్తూ ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసితో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని పేరు అడగగా జనగాం సాయి కిరణ్ అని చెప్పడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఒక కిలో 300 గ్రాముల గంజాయి లభించడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుల్ని ఇట్టి గంజాయి ఎక్కడి నుండి ఎవరు సరఫరా చేస్తున్నారని విచారించగా గంజాయికి అలవాటు పడి నిందితుని ఇంటి వద్ద ఉండే గడ్డం అరుణ్ కుమార్ ను అతని వద్ద కొనుక్కొని తాగేవాడిని గంజాయ్ కి అలవాటు పడి ఇలాంటి పని చేయడం చేతకాక గంజాయ్ తాగడానికి డబ్బులు సరిపోక పోవడంతో గంజాయి అమ్మి సులభంగా సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకుని గత కొంతకాలంగా తనకి గంజాయి అమ్ముతున్న అరుణ్ కుమార్ ని తనకు పెద్ద మొత్తంలో గంజాయి కావాలి నేను కూడా అమ్ముతానని అడగగా అరుణ్ ఒప్పుకోవడం జరిగింది. అరుణ్ అమ్మిన గంజాయిని తీసుకొని గోదావరిఖని లోని 5 ఇంక్లైన్ రామ్ నగర్ విట్టల్ నగర్ ఇలా కొన్ని ఏరియాల్లో తిరుగుతూ గంజాయ్ కొంతకాలంగా అమ్మి డబ్బు సంపాదిస్తూ తను కూడా గంజాయ్ తాగుతున్నానని ఒప్పుకోవడం జరిగింది. అరుణ్ కుమార్ సుమారు రెండు కిలోల గంజాయి అమ్మగా అందులో ఏడు వందల గ్రాముల గంజాయిని కొంతమందికి అమ్మడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతు యువత ఎక్కువగా గంజాయికి బానిస అయి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ, నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను, వారి ప్రవర్తనను నిశితంగా గమనించగలరన్నారు. ముఖ్యంగా వారు ఎవరితో స్నేహం చేస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో వారందరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100కి గాని, నేరుగా మాకు గాని సమాచారం ఇచ్చి యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా మాకు సహకరించగలరనీ కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడుననీ, గంజాయి అమ్మిన లేదా కొన్న లేదా సేవించిన వారిపై చట్టరీత్య కఠినచర్యలు తీసుకునబడుతాయన్నారు