ఒంగోలు
మతిస్థిమితం లేని ఓ బిచ్చగత్తెను లైంగికంగా దాడిచేసి ఆపై గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తిని ప్రకాశంజిల్లా చీరాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తిని ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం గెలాక్సీలో మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాలికా గార్గ్ మాట్లాడుతూ జిల్లాలోని చీరాల ప్రాంతంలో బిచ్చమెత్తుకునే మాయ అనే మహిళతో చీరాల నవాబుపేటకు చెందిన షేక్. కాలేషా వలి అలియాస్ వలి అనే ఆటో డ్రైవర్ బిచ్చగత్తె మాయతో పరిచయం పెంచుకుని శారీరకంగా అనుభవించాలనే మనసులో దుష్టమైన ఆలోచన కలిగి కాలేషా వలి అలియాస్ వలికి చెందిన ఆటోలో చీరాల బస్టాండు సమీపంలో ఎక్కించుకుని వేటపాలెం మండలం అక్కాయపాలెంలోని అబ్దుల్ కలాం కాలనీకి తీసుకుని వెళ్లి ఆమెను అనుభవించే క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో మాయ గొంతునులిమి చంపి అక్కడనుండి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ కాలేషా వలిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది.