Home ఆంధ్రప్రదేశ్ వెలమలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్

వెలమలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్

110
0

శ్రీకాకుళం
రాష్ట్రములో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వెలమ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు కేటాయించి ప్రాధాన్యత కల్పించాలని “ఆంధ్ర ప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం” రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.వెలమ సామాజిక వర్గానికి కనీసం రెండు మంత్రి పదవులను కేటాయించాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇప్పటికే మంత్రి పదవులల్లో,నామినేటెడ్ పదవుల్లో,జిల్లా పర్షిత్ చైర్పర్సన్ మొదలగు నామినేటెడ్ పదవుల్లోనూ తమ వెలమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెలమ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెలమ సామాజిక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రాధాన్యత కల్పించలేదని కావున ఇప్పుడైనా సరే మంత్రివర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులను కేటాయించి వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని ఆ ప్రకటనలో కోరారు.గత ప్రభుత్వ హయాంలో వెలమలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం కూడా తమకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో బలమైన వెలమ సామాజిక వర్గానికి రాజకీయాల్లో  ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Previous articleదేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు
Next articleగుజ‌రాత్‌లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ ప‌ట్టివేత‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here