రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి నూర్ మహ్మద్ కుంటా వద్ద ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మాణలు చెపట్టారనే సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఎమ్మార్వో జెసిబిల సహాయంతో కూల్చివేతలు చెపట్టారు. ప్రభుత్వ స్థలాలను కాపాడలంటూ కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేతలు చేపట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎవరైనా ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నిర్మాణాలు చెపట్టిన చట్టపరమై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.