కడప నవంబర్ 19
కడప నగరంలోని బుగ్గవంక పరివాహక లోతట్టు ప్రాంతాలయిన నాగరాజుపేట, రవీంద్రనగర్, బాలాజీ నగర్, కాగితాల పెంట, మరాఠీ వీధి , మురాద్ నగర్,గుర్రాలగడ్డ ప్రాంతాలలో వరదనీటి ప్రవాహాన్ని, నివాస ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు. అంజాద్ బాషా మాట్లాడుతూ నగరంలో తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసారు. పలు ప్రాంతాల్లో 11 తాత్కాలిక పునరావాస కేంద్రాలను.. ఏర్పాటు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు ముందు జాగ్రత్తగా నివాసాలను ఖాళీ చేసి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఎస్.బి.అహ్మద్ భాషా , డిప్యూటీ మేయర్ లు నిత్యానంద రెడ్డి , ముంతాజ్ జమాల్ వలీ , కార్పొరేటర్లు, మున్సిపాలిటీ, రెవెన్యూ,ఇరిగేషన్ , పోలీస్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ బుగ్గవంక లోతట్టు ప్రాంతాల పరిశీలించిన ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా బుగ్గవంక వరద పట్ల భయాందోళన వద్దు.....