Home జాతీయ వార్తలు పట్టాలు తప్పిన కన్నూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 2,348 మంది...

పట్టాలు తప్పిన కన్నూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 2,348 మంది ప్రయాణికులు సురక్షితం

85
0

చెన్నయ్ నవంబర్ 12
తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూరు-శివాడి ఘాట్‌ రైల్వే  స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున 3:50 గంటల ప్రాంతంలో కన్నూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్‌) తెలిపింది. రైలుపై ఒక్కసారిగా బండరాళ్లు పడడంతో కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలులో ప్రయాణిస్తున్న 2,348 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు చెప్పారు.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ సంఘటన తర్వాత బెంగళూరు రైల్వే డివిజనల్ సీనియర్ అధికారుల బృందం వైద్యులతో కలిసి ఉదయం 4.45 గంటలకు యాక్సిడెంట్ రిలీఫ్ రైలులో వైద్య పరికరాల వ్యాన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది.ప్రయాణికులతోపాటు ఆరు కోచ్‌లను క్లియర్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తొప్పూరులో పదిహేను బస్సులను ఏర్పాటు చేశారు. ఐదు బస్సులను సంఘటన స్థలంలో ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రయాణికులకు మంచినీరు, అల్పాహారం అందజేశారు. సీనియర్‌ రైల్వే అధికారులు, ప్రిన్సిపల్‌ హెడ్స్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ అధికారులు సహాయ పునరావాస పనులు చేపట్టారు.

Previous articleఈ తెలుగోడు తెలంగాణాకే కాదు.. దేశానికే గర్వకారణం
Next articleరళ మొట్టమొదటి స్వదేశీ ఎడ్యు యాప్ ‘హోమ్‌స్కల్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here