తుగ్గలి
అక్రమంగా పట్టుబడిన సారా మరియు మద్యం బాటిళ్లను డోన్ డిఎస్పి డోన్ సర్కిల్ పరిధిలోని ఎస్.ఐ ల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.శుక్రవారం రోజున డోన్ సరిహద్దు వద్ద డోన్ సర్కిల్ పరిధిలోని తుగ్గలి జొన్నగిరి మరియు మద్దికేర ఎస్.ఐ ల ఆధ్వర్యంలో వాటిని ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నాటు సారా తయారీ మరియు అక్రమ మద్యం రవాణా వంటి చర్యలను ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి ఎస్.ఐ షామీర్ భాష, జొన్నగిరి ఎస్ఐ రామాంజనేయులు,మద్దికేర ఎస్.ఐ మమత,తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు