రాయపూర్
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్ర రాయ్పూర్ రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఒక రైలు బోగీలో జరిగిన పేలుడులో ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది గాయపడ్డారు. సీఆర్పీఎఫ్కు చెందిన 211
బెటాలియన్ జవాన్లు ప్రత్యేక రైలులో జర్సుగూడ నుంచి జమ్మూ కు వెళుతుండగా క్యాట్రిడ్జ్ బాక్స్ పోరపాటున కంపార్టుమెంట్ లో కింద పడింది. బాక్సులో ఉంచిన గ్రెనేడ్ పేలింది. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఫ్లాట్ ఫామ్ నెండర్ 2 లో ఈ
ఘటన జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. హెడ్ కానిస్టుబుల్ , చవాన్ వికాస్ లక్ష్మణ్, రమేష్ లాల్, రవీందర్ కర్, సుశీల్, దినేష్ కుమార్ పైక్రా లు గాయపడ్డారు. తీవ్రమైన గాయాల కారణంగా ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను
ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మిగతావారిని రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక రైలు కావడంతో సాధారణ ప్రయాణికులు ఎవ్వరూ దాంట్లో లేరు. ఘటన సమాచారంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను
పరామర్శించారు.ఈ పేలుడు ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు